వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అనే వార్త ఒక్కసారిగి హైలెట్ అవుతోంది. దీనికి గల కారణం ఏంటి నిజంగానే రోజా వైసీపీ పార్టీకి దూరం కానున్నారా.. ఒక వేళ దూరం అయితే రోజా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న రోజా అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఫ్యామిలీతోనే పూర్తి సమయాన్ని గడుపుతున్నారు. వెకేషన్ కోసం ఈ మధ్య ఇంగ్లాండ్ కూడా వెళ్లొచ్చారు.
ఇవేమి ఎవరు అంత పట్టించుకోలేదు కాని.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతా నుంచి వైసీపీ పార్టీ పేరును తొలగించారు రోజా. మొన్నటి వరకూ తన ఇన్స్టాగ్రామ్ లో వైసీపీ నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రిగా పేరు ఉండేది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను ఆమె ఛేంజ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రిగా మార్పు చేశారు. అంతేకాదు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కూడా అన్ ఫాలో చేశారు. జగన్ తో ఉన్న ఫొటోను కూడా తొలగించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజు గుడ్ బై చెప్పబోతున్నారా అనే చర్చ ఊపందుకుంది. ఈ పరిణామంతో అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం షాక్ కు గురయ్యారు. మరి పార్టీ పేరు తొలగింపు, జగన్ను అన్ ఫాలో చేయడం వెనుక ఉన్న కారణాలు తెలియాలంటే రోజానే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు.
అలాగే ఇటీవల తమిళనాడులో వరుసగా పలు దేవాలయాలను సందర్శిస్తూ.. అక్కడి మీడియాకు ఫోకస్ అవుతున్నారు. ఈ పరిణామాలన్నీ రోజా వైసీపీని వీడనున్నారనే ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. పార్టీ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం నగరి మాజీ ఎమ్మెల్యే, పర్యాటకం- యువజన సర్వీసుల మాజీ మంత్రిగా తన బయోడేటాలో పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో రోజాకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవ్చని టాక్. పార్టీతోపాటు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. 2024 ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్‌ను సెంటిమెంట్‌తోపాటు ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేసి టిక్కెట్ తెచ్చుకున్నారట. బెదిరించి సీటు తెచ్చుకున్నా.. గెలవలేదు. మరో పార్టీలో చేరదామనుకున్నా దారులు అన్ని మూసుకుపోయాయి. దీంతో ఏపీ రాజకీయాలకు బైబై చెప్పి.. తమిళ రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రోజా సిద్దమయిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
తమిళ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగంలో రోజా చేరే అవకాశం ఉందని టాక్. ఆమె భర్త సెల్వమణి తమిళ సినీ దర్శకుడు. రోజా కూడా తమిళ సినిమాల్లో నటించారు. దీంతో తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందుకు తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని.. అక్కడకు మాకాం మార్చుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది.