సినిమా టికెట్ ధరల్లో వెసులుబాటు ఉండడం సమంజసం, ఈ విషయంలో పునరాలోచించండి : చిరంజీవి

Actor Chiranjeevi, AP Cinema Tickets Price Issue, AP CM YS Jagan, Chiranjeevi, Chiranjeevi Request AP CM YS Jagan to Reconsider On Cinema Tickets Price Issue, Cinema halls can’t sell movie tickets under new Andhra law, Cinema Tickets, Cinema Tickets Price, Cinema Tickets Price Issue, Cinema Tickets Price Issue In AP, Mango News, Megastar, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Request AP CM YS Jagan to Reconsider On Cinema Tickets Price Issue

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల బుకింగ్ విషయంలో ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పోర్టల్/వెబ్‌సెట్ ను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే ప్రజలందరికి మంచిగా అందుబాటులో ఉండేలా టికెట్ల ధరను తీసుకొస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆన్‌లైన్‌ విధానాన్ని స్వాగతిస్తూ, సినిమా టికెట్ ధరల వెసులుబాటు విషయంలో పునరాలోచించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు.

“పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం, తగ్గించిన టికెట్‌ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్‌ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది” అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =