ఏపీలో జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి పండుగ సెలవులు

AP Sankranthi Festival Holidays, AP Schools Sankranthi Festival Holidays, AP Schools Sankranthi Holidays, Mango News Telugu, Sankranthi Festival Holidays, Sankranthi Festival Holidays Announced, Sankranthi Festival Holidays Announced for Schools in AP, Sankranthi Festival Holidays In AP, Sankranthi Holidays, Sankranthi Holidays Announced, Sankranthi Holidays Announced In AP, Sankranthi Holidays In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సెలవుల తేదీలను ప్రకటించారు. రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు జనవరి 12వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. జనవరి 10వ తేదీ ఆదివారం సెలవు కాగా, జనవరి 11న అమ్మ ఒడి రెండో విడత నగదు పంపిణీ కార్యక్రమం వలన పాఠశాలలు మధ్యాహ్నం వరకు తెరవనున్నారు. ఇక 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. జనవరి 18, సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.

మరోవైపు జనవరి 21, 22, 23 తేదీలలో 7, 8 తరగతులకు ఫార్మేటివ్‌–1 పరీక్షలు నిర్వహించాలని గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే సిలబస్ పూర్తి చేసే విషయంలో ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆ తరగతులకు ఫార్మేటివ్‌–1 పరీక్షలను ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్టు చెప్పారు. 9 మరియు 10 తరగతుల విద్యార్థులకు మాత్రం షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7, 8 తేదీలలోనే ఫార్మేటివ్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ