ఎంపీ గోరంట్ల మాధవ్ ఘటన ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

The Presidents Office Responds Over the Complaint of MP Gorantla Madhav Incident, President's Office responded Over Gorantla Madhav Issue, Presidents Office , MP Gorantla Madhav Video Call Issue, Mango News , Mango News Telugu, MP Gorantla Madhav Contraversy, Complaint onMP Gorantla Madhav Incident, YSR Congress Party, Telugu Desham Party, MP Gorantla Madhav Latest News And Updates, AP CM YS Jagan Mohan Reddy, TDP Chief Nara Chandrababu Naidu

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఎంపీ మాధవ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రాష్ట్రానికి చెందిన డిగ్నిటీ ఫర్ వుమెన్ జేఏసీకి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి ఎంపీపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇంకా వారు దీనిపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, పలువురు కేంద్ర మంత్రులు, అలాగే జాతీయ మహిళా కమిషన్ తదితరులను కూడా కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో మహిళా నేతలు సమర్పించిన ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. అలాగే మహిళా నేతలు గోరంట్లపై ఇచ్చిన ఫిర్యాదు కాపీని కూడా ఏపీ ప్రధాన కార్యదర్శికి పంపించారు. ఈ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి దీనిపై సమాచారం ఇస్తూ రాష్ట్రపతి కార్యాలయం లేఖను పంపింది. దీంతో ప్రస్తుతం ఈ వివాదం తిరిగి రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. దీనిపై ఏపీ సీఎస్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని అందరిలో ఆసక్తి నెలకొంది. కాగా ఆగస్ట్ 18న గోరంట్ల మాధవ్ కు చెందినదిగా భావిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దీనిపై వివాదం కొనసాగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − fifteen =