ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. చిత్తూరు జిల్లా, సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే కి స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా ఫలితం పాజిటివ్ గా వచ్చినట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం ప్రస్తుతం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతునట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏపీలో సెప్టెంబర్ 27 నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,674 కి చేరుకుంది. వీరిలో 6,05,090 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 64876 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu