
కొన్నాళ్లుగా ఏపీ సీఎం జగన్ పరిస్థితి అయోమయంగా మారిపోయింది. ఒకవైపు ప్రత్యర్థి కూటమి దూకుడు చూపిస్తుంటే.. ఇంకోవైపు కుటుంబం దూరమై జగన్‌ను టెన్షన్ పెడుతోంది. సొంత చెల్లెలు షర్మిల ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి అన్న జగన్ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంకోవైపు చిన్నాన్న వివేకానంద రెడ్డి కేసు వెంటాడుతూనే ఉంది. చెల్లెలు సునీత కూడా జగనన్నకు ఓటు వేయొద్దని బాహాటంగానే చెప్పుకొస్తున్నారు. అంతేకాదు జగన్ రాజకీయ ప్రస్థానంలో మొదటి నుంచి తోడుగా ఉంటూ వస్తున్న తల్లి విజయమ్మ కూడా.. కూతురి వైపే ఉంటూ.. జగన్‌తో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా షర్మిల వెంటే విజయమ్మ నడిచారు.
దీంతో ఏపీలో త్వరలో రాబోతున్న ఎన్నికల సమయంలో కూడా విజయమ్మ.. కొడుకును కాదని కూతురు షర్మిలతో పాటే నడుస్తారని అందరూ ఊహించారు. కానీ అంతలోనే షర్మిలకు బిగ్ షాక్ ఇచ్చారు విజయమ్మ. ఇన్ని రోజులు కూతురుకు తానున్నాను అంటూ భరోసా ఇచ్చిన తల్లి విజయమ్మ.. ఇక ఇప్పుడు మళ్లీ కొడుకు జగన్‌కు దగ్గర అయ్యారు. ఇడుపుల పాయలో జగన్ పక్కన విజయమ్మను చూసి అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఒకవైపు ప్రతిపక్షాల దూకుడు, కుటుంబ సభ్యుల వ్యతిరేకతతో పాటు ఇంకోవైపు బాబాయి వివేకా హత్య కేసు వల్ల జగన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సీఎం జగన్ తల్లిని శరణు కోరారన్న వార్తలు వినిపిస్తున్నాయి. లేకపోతే తల్లి విజయమ్మ జగన్ వెంట నడవడానికి సిద్ధమవ్వరన్న టాక్ నడుస్తోంది.
నిజానికి విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా తొలగించినప్పటి నుంచే జగన్‌కు అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారం మొదలు కాబోతుందనుకుంటున్న సమయంలో.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద విజయమ్మ కొడుకు జగన్ తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం, కొడుకుకు మద్ధతుగా బైబిల్ చదవడం చూసి అంతా షాక్ అయ్యారు.నిజంగానే ఇది షర్మిలకు పెద్ద షాక్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తల్లి విజయమ్మ తన వెంట లేకపోతే షర్మిల ఒంటరిగా ముందుకు నడిచి ఎన్నికల్లో నడవగలరా అంటూ చర్చ నడుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY






































![జూలై 1 నుంచి ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతాలు అందుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు APSRTC Employees To Get Salaries as per Govt Pay Scale From July 1, APSRTC Employees To Get Govt Salaries From July 1, APSRTC Employees To Get Salaries as per Govt Pay Scale, AP Government announced government salaries for all the Andhra Pradesh State Road Transport and Corporation employees, Andhra Pradesh Government announced government salaries for all the APSRTC employees, APSRTC employees, Andhra Pradesh State Road Transport and Corporation employees, Andhra Pradesh State Road Transport and Corporation], APSRTC employees would receive salaries as per the government pay scale from the 1st of July, government pay scale, YS Jagan Mohan Reddy has taken a historic decision to merge the RTC with the government, merge the RTC with the government, Govt Salaries, APSRTC Employees News, APSRTC Employees Latest News, APSRTC Employees Latest Updates, APSRTC Employees Live Updates, Mango News, Mango News Telugu,](https://telugu.themangonews.com/wp-content/uploads/2022/06/APSRTC-Employees-To-Get-Salaries-as-per-Govt-Pay-Scale-From-July-1-100x70.jpg)