
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలు భారీగా మోహరించారు.
ఆయా స్ట్రాంగ్ రూముల వద్ద ఇప్పటికే మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద రౌండ్ ది క్లాక్ సీసీ కెమెరాలతో గట్టి నిఘా పెట్టారు. అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద ఇప్పుడు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అంతేకాకుండా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో కలిసి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే అగ్నిమాపక సిబ్బందిని కూడా ఆయా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు.
తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ముగిసిన పోలింగ్ ప్రక్రియ.. నిన్న ఉదయం 7 గంటలకు మొదలయిన పోలింగ్ .. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే కొన్ని చోట్ల సరైన సమయానికే పోలింగ్ ముగిసిపోగా.. మరికొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం రాత్రి 10- 11 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది.సాయంత్రం 6 గంటల లోపు క్యూలో నిలబడ్డ ఓటర్లకు నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా…వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో చాలా ప్రాంతాల్లో రాత్రి 10- 11 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరిగినట్లు అధికారులు వివరించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 64.74శాతం పోలింగ్ నమోదు అవగా.. ఎప్పటిలాగే హైదరాబాద్‌లో అత్యల్ప పోలింగ్ శాతం నమోదయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY