కావాలనే తనను తప్పించారంటూ ఆనం ఆరోపణ

Anam Ramanaraya Reddy, Anam Sensational comments, YCP, Speaker, Jagan, Thammineni Seetha Ram, Sensational comments, TDP, YSRCP MLA, MLA Anam Ramanarayana, Andhra Pradesh News Updates, AP Political News, Mango News Telugu, Mango News,AP Latest news and Updates
Anam Ramanaraya Reddy, Anam Sensational comments, YCP, Speker, Jagan, Thammineni Seetha Ram

ఏపీలో ఎన్నికల వేళ అసంతృప్త నేతలు చేస్తున్న కామెంట్లతో ఏపీ పొలిటికల్ వాతావరణం హీటెక్కిపోతోంది. తాజాగా  వైసీపీ నుంచి తాను తప్పుకోలేదని, కావాలనే తప్పించారంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండే తమ ప్రాంతంలో మైనింగ్ దగ్గర నుంచి అంతా కూడ మాఫియా లాగా మార్చేసి దందాలు చేస్తున్నారని ఆనం ఆరోపించారు.

దాని గురించి  ప్రశ్నించడం వల్లే తనను  కావాలనే పార్టీ నుంచి తప్పించారని అన్నారు. దీంతో ఆ సమయంలో తానే బయటకి రావాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.   అనర్హత నోటీస్‌పై స్పీకర్ తమ్మినేని సీతారాంతో ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి పర్సనల్ హియరింగ్ కు హాజరయ్యారు.హియరింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను మొదటిసారి హాజరైనప్పుడు తనను చాలా వివరాలు అడిగారని, వాటన్నిటికి సమాధానాలు చెప్పడమే కాకుండా.. దానికి సంబందించిన పేపర్స్ కూడా ఇచ్చానని చెప్పుకొచ్చారు.

మీడియాలో ప్రచురించిన వాటన్నిటినీ చీఫ్ విప్ ప్రసాదరాజు ఆథరైజ్ చేసి ఇచ్చారని, వేరే మేనేజ్మెంట్‌కు చెందినవి వారెలా పరిగణలోకి తీసుకుంటారని ఆనం..తమ్మినేనిని ప్రశ్నించినట్లు చెప్పారు. ప్రసాదరాజు ఆథరైజ్ చేస్తే వాటికి విలువ ఎలా ఉంటుందని తాను గట్టిగా అడిగినట్లు చెప్పారు. అవేమీ కూడా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సరిపోవని, వాటి ఆధారంగా వారెలా వేటు వేస్తారని తాను ప్రశ్నించానని అన్నారు.

అదేకాకుండా తమ రాజకీయ స్వార్ధం కోసం వైఎస్సాసీపీ స్పీకర్ స్థానాన్ని కూడా వాడుకుంటోందని ఆనం ఆరోపించారు.  అయినా ఈ విషయాలతో పాటు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను స్పీకర్ ఒక్కరికి మాత్రమే ఆపాదించలేమని అన్నారు. వైఎస్సాసీపీ వల్ల రాజకీయాలే ఇప్పుడు గందరగోళంలోకి వెళ్లాయని ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. కాకపోతే తన పదవి కాలంలో చివరి రోజు సమావేశాలకు తాను హాజరు కావడం తృప్తి నిచ్చిందని ఆయన చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఈ నిర్ణయం వచ్చి ఉంటే హాజరుకాలేకపోయేవాడినని, ఆ బాధ తనను వెంటాడేదంటూ ఆనం రామనారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE