విజయవాడ వెస్ట్ కోసం బీజేపీ-జనసేన పట్టు..

BJP-Jana Sena Hold For Vijayawada West.., Jana Sena Hold For Vijayawada, BJP-Jana Sena Hold For Vijayawada, Vijayawada West, BJP-Janasena, Pothina Mahesh, BJP,Jana Sena, Vijayawada West Seat,Adduri Sriram, Abburi Sriram, Bhaskara Rao, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
BJP-Janasena,Pothina Mahesh, BJP,Jana Sena, Vijayawada West Seat,Adduri Sriram, Abburi Sriram, Bhaskara Rao

ఎన్నికలకు సమీపిస్తున్న కొద్దీ విజయవాడ వెస్ట్ సీట్ హీట్ పెరిగిపోతుంది. జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన మహేష్‌కే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టడంతో రోజురోజుకు ఈ వివాదం ముదురుతోంది.

ఒకవైపు తమ వైపు నుంచి అసంతృప్తిగళం వినిపిస్తూనే ..మరోవైపు ఆత్మీయ సమావేశాలతో జనసేన శ్రేణులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. మొదటి లిస్టు ప్రకటన తర్వాత  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిచి సీటు తమకే వస్తుందని చెప్పారని.. రెండో లిస్టులో ప్రకటిస్తానంటూ హామీ కూడా ఇచ్చారని,కానీ ఇప్పుడు ఆ సీటు బీజేపీకే వెళ్లినట్లు ప్రచారం జరుగుతుందని మహేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంతోకాలంగా పార్టీ జెండా మోసిన తాను.. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన  తర్వాతే తాను ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నట్లు పోతిన మహేష్ చెబుతున్నారు. కానీ జనసేన పార్టీ నుంచి  దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో విజయవాడ వెస్ట్  టికెట్ తనకే ఇవ్వాలంటూ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

మహేష్‌కు మద్దతుగా యువత, వీర మహిళలు రోజుకో విధంగా ఆందోళనలు చేస్తున్నారు.  తాజాగా దుర్గమ్మ గుడిలో 108 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించి తమ నిరసనను తెలియజేశారు. అయితే మరోవైపు  బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఆత్మీయ సమావేశాలు కూడా పోటా పోటీగా పెడుతుండంపై విజయవాడ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.

జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వెంటే పోతిన మహేష్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా.. అది విజయవాడ కేంద్రంగానే జరిగేది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చెప్పాలంటే.. విజయవాడ అర్బన్ లో జనసేన బలంగా ఉన్న ఏకైక ప్లేస్ విజయవాడ వెస్ట్ మాత్రమే అని గట్టిగా చెప్పొచ్చు.

2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మహేష్.. 15 శాతం ఓటు బ్యాంక్ సంపాదించారు. నగరాల సామాజిక వర్గానికి చెందిన పోతిన మహేష్‌కు ఈ సారి కూడా పార్టీ టికెట్ వస్తుందని  అంతా భావిస్తూ వచ్చారు. అయితే పొత్తులో భాగంగా జరిగిన  చర్చల తర్వాత సెంట్రల్ సీటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కేటాయిస్తారంటూ వార్తలు వినిపించడంతో..  మహేష్ వర్గీయులు ఆందోళన బాటపట్టారు.

మరోవైపు కమలం పార్టీలో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు కూడా ఎవరికి వారే తమకే టికెట్ అనే ధీమాతో ఉన్నారు.  ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఇప్పటికే రేసులో ఉండగా, మాజీ అధ్యక్షుడు అబ్బూరి శ్రీరామ్ కూడా  విజయవాడ వెస్ టికెట్ ఆశలు పెట్టుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా పోటీ పడుతూ  ఉండగా తాజాగా ఆర్యవైశ్య నాయకుడు వక్కలగడ్డ భాస్కరరావు తన అభిమానులతో ఆత్మీయ సమావేశం పెట్టి మరీ తానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బరిలో ఉంటానంటూ చెప్పడం హాట్ టాపిక్ అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − fourteen =