వైసీపీలో ఆ ఎమ్మెల్యేలు కనిపించడం లేదట..

Where are 111 MLAs?, YCP MLAs,YCP, MLAs,YSRCP, TDP, Janasena, Congress, BJP, Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Where are 111 MLAs?, YCP MLAs,YCP, MLAs,,YSRCP, TDP, Janasena, Congress, BJP

ఓ వైపు ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు సిద్ధమవుతుంటే..  ఏపీ అధికార పార్టీ వైసీపీకి సంబంధించిన ఓ  షాకింగ్ విషయం ఇప్పుడు పొలిటికల్ తెర మీదకు  వచ్చింది. అభ్యర్థుల ఎంపికలో  ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణమా లేక, మరో  కారణం ఏమైనా ఉందా అనే చర్చ  ఏపీ వ్యాప్తంగా మొదలైంది. 151 ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్సాసీపీలో అసెంబ్లీకి  కేవలం 40మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరవడంతో..దీనిపై రకరకాల ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి.

తాజాగా ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలలో అధికార వైసీపీ నుంచి చాలా తక్కువమంది ఎమ్మెల్యేలు హాజరవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన  రెండో రోజు గవర్నర్ కి ధన్యవాదాలు తెలపడానికి  వైసీపీ నుంచి కేవలం నలభై మంది ఎమ్మెల్యేలు మాత్రమే కనిపించడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమైందనే ప్రశ్న నెట్టింట కూడా వైరల్ గా మారింది.

వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి సత్తా చాటుతామనే ధీమాతో ఉన్నఈ సమయంలో అధికార పార్టీ నిర్వహిస్తున్న ఆఖరు సమావేశాలకు.. ఎమ్మెల్యేలు సరిగ్గా హాజరు కాకపోవడం ఏంటంటూ చర్చలు జరుగుతున్నాయి. అయితే సర్వేల పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత జగన్ టికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కొంతమందిని వేరే నియోజకవర్గాలకు పంపుతూ మరికొంతమందిని నిర్దాక్షణ్యంగా పక్కన పెట్టేయడంతో చాలామంది అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారం జరుగుతోంది. మరికొంతమందిని ఎంపీలుగా పంపుతూ బలవంతపు రాజకీయాలు చేస్తుండటం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది.

ఈ విషయంలో కొంతమంది బాహాటంగా జగన్‌పై విమర్శలకు దిగుతూ పక్క పార్టీలవైపు వెళ్లగా.. మరికొంతమంది మాత్రం పైకి కనిపించకపోయాని.. లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.  తాజాగా అసెంబ్లీ సమావేశాలలో కనిపించిన ఈ గైర్హాజరీ నెంబరే దీనికి సాక్ష్యం అని చెబుతున్నారు. దీనికి తోడు అసెంబ్లీ సమావేశాల పేరు చెప్పి ఎమ్మెల్యేలతో సీట్ల గురించి మాట్లాడే అవకాశం కూడా జగన్ ఇవ్వడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికల కోసం జరిగే మాక్ పోలింగ్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారో అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + one =