
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలినట్లయింది. కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. తాజాగా జంగా కృష్ణమూర్తి వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో..ఆయనపై అనర్హత వేటు వేయాలని అధికార వైఎస్సర్సీపీ శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. జంగా కృష్ణమూర్తి పార్టీ ఫిరాయింపు వల్ల.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ కోరింది. దీనిపై వైఎస్సార్సీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌కు జంగాపై ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదుపై శాసన మండలి చైర్మన్ మోషేనురాజు.. జంగా కృష్ణమూర్తి నుంచి చాలా సార్లు వివరణ తీసుకున్నారు. జంగా కృష్ణమూర్తి ఇచ్చిన వివరణ ఆధారం చేసుకుని.. చివరకు ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. జంగా కృష్ణమూర్తి 2009 నుంచి 2019 మధ్య కాలంలో పల్నాడు జిల్లాలోని గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటాలో జంగాను ఎమ్మెల్సీని చేసింది.
వైఎస్సార్సీపీలో ఉన్న సమయంలో ఆయన విప్ గానూ పనిచేశారు. అయితే, సరిగ్గా ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఏప్రిల్ 1న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. ఏప్రిల్ 6న పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో కృష్ణమూర్తి ఆ పార్టీ కండువాను కప్పుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY