ఏపీలో 13 జిల్లాలకు కొత్త ఇంచార్జ్ మంత్రులు నియామకం

AP Appoints In-Charge Ministers For 13 Districts AP Political Live Updates 2019, AP Govt Appoints In-Charge Ministers, AP Govt Appoints In-Charge Ministers For 13 Districts, AP Govt Appoints InCharge Ministers For 13 Districts, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, InCharge Ministers For 13 Districts In AP, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను మారుస్తూ, కొంతమంది కొత్తవారికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వంటి బాధ్యతలను చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు 13 జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులు నియమిస్తూ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేసారు.

జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు:

జిల్లా                  ఇంఛార్జ్ మంత్రులు

తూర్పుగోదావరి —- మోపిదేవి వెంకటరమణ
పశ్చిమగోదావరి —- పేర్ని వెంకట్రామయ్య
ప్రకాశం —- బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
నెల్లూరు —- బాలినేని శ్రీనివాస రెడ్డి
కృష్ణా —- పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
గుంటూరు —- చెరుకువాడ రంగనాథరాజు
వైఎస్‌ఆర్‌ కడప —- ఆదిమూలపు సురేష్‌
అనంతపురం —- బొత్స సత్యనారాయణ
కర్నూలు —- అనిల్‌ కుమార్‌ యాదవ్‌
చిత్తూరు —- మేకపాటి గౌతమ్‌ రెడ్డి
శ్రీకాకుళం —- కొడాలి నాని
విజయనగరం —- వెల్లంపల్లి శ్రీనివాసరావు
విశాఖపట్నం —- కురసాల కన్నబాబు

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =