శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన జలాశయానికి ఎక్కువుగా వరద పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 4,60,154 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. దీంతో తాజాగా అధికారులు మొత్తం 10 గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 884.40 అడుగులు ఉంది. అలాగే శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.38 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత కొన్ని రోజులుగా వరద నీరు ఎక్కువగా చేరుతుండడంతో జూలై 28, బుధవారం సాయంత్రం నుంచి గేట్లు ఎట్టి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సమీప ప్రజలు ఆ దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు. మరోవైపు శ్రీశైలం రైట్ బ్యాంకు పవర్ హౌస్, లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ