రాష్ట్రంలో 6 వేల కోట్లతో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం – మంత్రి తలసాని శ్రీనివాస్

2nd Phase Of Sheep Distribution Scheme, Koppula Eshwar Started Second Phase Sheep Distribution in Huzurabad Today, Mango News, Ministers Talasani, Rs 6k cr for sheep distribution, second phase of sheep distribution, Second Phase Sheep Distribution, Second Phase Sheep Distribution in Huzurabad, Second Phase Sheep Distribution in Huzurabad Today, Telangana govt sanctions Rs 6000 crore for second phase, Telangana Second phase of sheep distribution

రాష్ట్రంలోని గొల్ల కురుమలందరూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో లాంఛనంగా ప్రారంభించామని, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని 6 వేల కోట్లతో ప్రారంభించామని అన్నారు. రాష్ట్రంలోని 18 సంవత్సరాలు దాటిన ప్రతి గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయుటలో భాగంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ ,మైనార్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుటకు సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 6వేల కోట్ల 70 లక్షలతో మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో 80 లక్షలు గొర్రెల యూనిట్లను గొల్లకుర్మలకు పంపిణీ చేశామని తెలిపారు. వాటి ద్వారా కోటి 30 లక్షల గొర్రె పిల్లలు ఉత్పత్తి అయ్యాయని అన్నారు. తద్వారా దేశంలోనే గొర్రెల సంపద ఎక్కువ గల నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. దళితుల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికలు ,వైకుంఠ దామాల నిర్మాణాలు, నర్సరీలు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇలా అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పంపిణీ చేసిన గొర్రెలు అనారోగ్యంతో చనిపోతే వారం రోజుల్లోగా ఇన్సూరెన్స్ ఇప్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గొల్ల కురుమలకు మల్లన్న బీరప్ప దేవుళ్ళ స్వరూపమే రాష్ట్ర ముఖ్యమంత్రి అని మంత్రి కొనియాడారు. గొల్ల కురుమలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి బంగారు భవిష్యత్తును కల్పించాలని అన్నారు.

అన్ని వర్గాలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి: మంత్రి కొప్పుల ఈశ్వర్

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో 80 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని చెప్పారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించుకున్నామని, ఇక్కడ 4 వేలకు పైగా లబ్ధిదారులకు గొర్ల యూనిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. గొల్ల కురుమలను గొప్పగా గౌరవించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. మాట తప్పని మడమ తిప్పని నిజాయితీ గల జాతి గొల్ల కురుమ జాతి అని మంత్రి అన్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఆరున్నర సంవత్సరాలలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, సాగునీటితో బీడు భూములు సస్యశ్యామలమై పచ్చదనంతో కళకళలాడుతున్నాయని అన్నారు. సంక్షేమ రంగంలో రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు.

రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం సందర్భంగా 500 గొర్రెల యూనిట్లు పంపిణీ చేయుటకు 12,000 గొర్రెలు తెచ్చారని తెలిపారు. గొర్రెల యూనిట్ ధరను లక్షా 25 వేల నుండి లక్షా 75 వేలకు సీఎం కేసీఆర్ పెంచారని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఈ సందర్భంగా 500 గొర్రెల యూనిట్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, శాసనమండలి సభ్యులు ఎగ్గే మల్లేశం, వరంగల్ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనితరావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పశుసంవర్ధక శాఖ ఎండి రామచందర్, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =