శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు, 3 గేట్లు ఎత్తివేత

Srisailam Project: 3 Gates Lifted to Discharge Huge Flood Water

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన జలాశయానికి ఎక్కువుగా వరద పెరిగింది. దీంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, గత కొన్ని రోజులుగా వరద నీరు ఎక్కువగా చేరడంతో ఆ స్థాయికి చేరే అవకాశం ఉండడంతో ముందుగానే గేట్లు ఎట్టి నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సమీప ప్రజలు ఆ దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు. మరోవైపు శ్రీశైలం రైట్ బ్యాంకు పవర్ హౌస్, లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu