ఆక్సిజన్‌ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్న ఏపీ ప్రభుత్వం

Oxygen Plants in AP,AP Oxygen Plants,Plenty Oxygen Plants Established In Government Hospitals In Andhra Pradesh, Plenty Oxygen Plants, Government Hospitals In Andhra Pradesh, Government Hospitals, Oxygen Plants, AP News, AP Updates, AP Live Updates, Government General Hospitals, Hospitals, covid-19 new variant, New Covid 19 Variant, New Covid Strain Omicron, New Coronavirus Strain, Mango News, Mango News Telugu, AP Covid rules, AP Covid News latest, 124 Hospitals, 144 Oxygen Plants,

ఆక్సిజన్‌ కొరత కారణంగా కరోనా రెండో దశలో రాష్ట్రంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం, అంతటా కోవిడ్‌ మూడో దశ మొదలైన నేపథ్యంలో.. మళ్ళీ ఆనాటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాణవాయువు కొరతలేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ‘జగనన్న ప్రాణవాయువు’ కార్యక్రమం పేరుతో ఆక్సిజన్‌ ప్లాంట్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్లాంట్లను సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.

50, అంతకన్నా ఎక్కువ పడకలు కలిగిన ప్రతి ప్రభుత్వాసుపత్రిలో.. గాలి నుంచి మెడికల్‌ ఆక్సిజన్‌ తయారుచేసే ప్రెజర్‌ స్వింగ్‌ అడ్సార్పషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా.. 124 ఆసుపత్రుల్లో 144 పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం రూ.189.5 కోట్లు వెచ్చించింది. ఇవి నిమిషానికి.. 500, 1000 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా నిమిషానికి 93,600 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తికి ఆస్కారం ఉంటుంది. పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కరోనా మూడో దశ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 7 =