శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేత

Sri Mallikarjuna Swamy Temple, Srisailam, Srisailam Darshans Close, Srisailam Darshans will not be Allowed For One Week, Srisailam Mallikarjuna Swamy Temple, Srisailam Temple, telangana, Telangana Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జూలై 15, బుధవారం నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ ఈవో ఒక ప్రటన విడుదల చేశారు. ఆలయంలో ఇద్దరు పరిచారకులు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది కరోనా బారిన పడడంతో వారం పాటు దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఈవో పేర్కొన్నారు. అలాగే స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా జరుగుతాయని ఈవో వెల్లడించారు. మరోవైపు కర్నూల్ జిల్లాలో జూలై 14, మంగళవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3823 కు చేరుకుంది. వీరిలో 2105 మంది కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1605 మంది చికిత్స పొందుతున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu