పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీం షాక్

supreme court, mla pinnelli ramakrishna reddy, counting center, ap
supreme court, mla pinnelli ramakrishna reddy, counting center, ap

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయనివ్వకుండా అడ్డుపడి హైకోర్టు తప్పు చేసిందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణలో పోలీసులు కూడా పూర్తిగా విఫలమయ్యారని అభిప్రాయపడింది.

ఏపీలో ఎన్నికలవేళ పలు చోట్ల రసవత్తరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. విధ్వంసం, దాడులు, రక్తపాతాల మధ్య పలు చోట్ల పోలింగ్ కొనసాగింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏకంగా ఈవీఎం మిషన్‌నే ధ్వంసం చేసి సంచలననానికి తెరలేపారు. మే 13న పోలింగ్ జరుగుతుండగా పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లోకి రామకృష్ణారెడ్డి వెళ్లారు. ఈవీఎం, వీవీ ప్యాట్లను ధ్వంసం చేశారు. అడ్డుకున్న టీడీపీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావుపై కూడా దాడి చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం చోటుచేసుకుంది.

అయితే ఈవీఎం, వీవీ ప్యాట్లను ధ్వంసం చేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. పిన్నెల్లి ఎవరికీ కాంటాక్ట్‌లో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఏపీ హైకోర్టు తలుపు తట్టారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అలాగే జూన్ 4న కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించుకునేలా ఆదేశాలను కూడా హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. ఈక్రమంలో హైకోర్టు తీర్పుపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.

అటు టీడీపీ పోలింగ్ ఏజెంట్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి ప్రాణహానీ ఉందని.. ఏపీ హైకోర్టు పిన్నెల్లికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును కోరారు. అలాగే కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ మేరకు వాదనలు విన్న సుప్రీం.. హైకోర్టు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసంది. ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా.. ఉండాలంటే.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా శిక్ష‌లు అమలు చేయాలని అభిప్రాయపడింది. జూన్ 6వ తేదీ వరకు నియోజకవర్గంలోకి.. కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లేందుకు అనుమతి లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఆ తేదీ లోపు ఈ కేసును పరిష్కరించాలని సుప్రీంకోర్టు.. ఏపీ హైకోర్టును ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY