ఏపీలో ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ ప్రారంభించిన సీఎం జగన్‌

Andhra Pradesh, AP CM YS Jagan, AP CM YS Jagan Launches YSR Jagananna Permanent Land Rights Land Protection Scheme, CM YS Jagan, Jagan launches land protection scheme, Jagananna Permanent Land Rights, Land Protection Scheme, Land survey required to protect lands, Mango News, YSR Jagananna, YSR Jagananna Land Rights, YSR Jagananna Permanent, YSR Jagananna Permanent Land Rights Land Protection Scheme

సామాన్యుడు ఒక స్థిరాస్తి సంపాదించుకోవడానికి తన జీవితకాలం కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి అంతకష్టపడి కొన్న ఆ స్థిరాస్తి విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే తాను పడే వేదన అంతా ఇంతా కాదు. అయితే, ఇకపై స్థిరాస్తుల డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లకు చెక్‌ పెడతామని, దళారీ వ్యవస్థ రద్దు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ ‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తాన క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్రామ కంఠాల్లోని స్థిరాస్తుల సర్వే, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని, గ్రామ సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఉంటుందన్నారు.

‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం’ ద్వారా మంచి కార్యక్రమం ద్వారా ఏపీ ప్రభుత్వం.. దేశంలోనే తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే నిర్వహిస్తుందని తెలిపారు సీఎం జగన్. భవిష్యత్‌లో వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్నారు. తొలి దశలో 51 గ్రామాల్లో 29,563 ఎకరాల భూముల రీసర్వే చేశాం. భూ సర్వే పూర్తి చేశామని, మరో 11,501 గ్రామాల్లో డిసెంబర్‌ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మీ ఆస్తులు లావాదేవీలు మీ గ్రామంలో కనిపించే విధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు భూములకు సంబంధించి భూములకు సంబంధించి ట్యాంపరింగ్‌ జరుగుతోందన్న ఫిర్యాదులు వచ్చాయి. పట్టాదారు పాస్‌ బుక్‌ల వల్ల ఆశించినంత మేలు జరగలేదు. భూమికి చెందిన నిర్ధిష్టమైన హద్దులు, హక్కులు ఇప్పటివరకు లేవు. ముఖ్యంగా 90 శాతం కేసులు సివిల్‌ వివాదాలకు సంబంధించినవే. శాస్త్రీయ పద్దతుల్లో భూములకు నిర్థిష్టంగా మార్కింగ్‌ చేసి, ప్రతి ఒక్కరికీ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ ఇస్తే ల్యాండ్‌ వివాదాలకు చెక్‌ పెట్టొచ్చు. 2023 కల్లా సమగ్ర రీ సర్వే చేసి యూనిక్‌ ఐడీ కార్డ్‌, డేటా అప్‌డేట్‌ ఇస్తాం. ఎమ్మార్వోల ద్వారా భూ యజమానుల అభ్యంతరాలను పరిష్కారం చేశాం. ప్రతి భూ కమతానికి ఉచితంగా భూ రక్ష హద్దు రాళ్లు ఇస్తామని సీఎం జగన్ తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 12 =