ఏపీలో స్విగ్గీ సేవలు ఇక ఉండవు..

Swiggy Services No More In AP, No More Swiggy Services In AP, Swiggy Services In AP, Swiggy Services Stopped In AP, Online Food, Online Food Delivery, Swiggy Services, AP Swiggy Services, Swiggy Food Delivery, Swiggy, Andhra Pradesh, AP Live Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అప్లికేషన్. ఇందులో ఏదైనా ఆర్డర్ పెడితే క్షణాల్లో డెలివరీ చేస్తారు. ఫుడ్ డెలివరీ మరియు ఇస్టమర్ట్ సేవలు అన్ని ఊర్లలో బాగా ప్రసిద్ధి చెందాయి. అయితే ఇది ఇలా ఉండగా స్విగ్గీకి కి తాజా గా ఒక షాక్ తగిలింది..

ఏపీలో ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న స్విగ్గీకి షాక్ తగిలింది. రాష్ట్రంలో కొంతకాలంగా స్విగ్గీతో హోటల్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14 నుంచి తమ నిర్ణయం అమల్లోకి వస్తుందని హోటళ్ల అసోసియేషన్ పేర్కొంది. దీంతో తప్పనిసరి పరిస్దితుల్లో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తమకు నగదు చెల్లించకుండా స్విగ్గీ సంస్థ ఇబ్బందులకు గురి చేస్తుందని హోటల్‌, రెస్టారెంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్విగ్గీకి అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు హోటల్ యాజమాన్యాల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.

ఫుడ్ డెలివరీ అందిస్తున్న జొమాటో, స్విగ్గీ సంస్థలు తమకు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు ఏపీలోని హోటల్ యజమానులు. తాము ఇచ్చిన ఫుడ్ కు డబ్బులను వారంలో లేదా మరోసటీ రోజే ఈ సంస్థలు ఇస్తాయని చెప్పారు. కాగా గత కొన్ని రోజుల నుంచి తమకు ఈ సంస్థలు చేసిన అమ్మకలకు సకాలంలో బిల్లులు చెల్లించక ఇబ్బందులు గురి చేస్తున్నాయని అన్నారు. అయితే ఈ రెండు సంస్థలతో పలు మార్లు చర్చలు జరపగా.. జొమాటో మాత్రమే తమ అభ్యంతరాలను అంగీకరించిందని హోటల్ అసోసియేషన్ పేర్కొంది. స్విగ్గీ మాత్రం తమ డిమాండ్లను పక్కకు పెట్టిందని.. అందుకే ఏపీ వ్యాప్తంగా స్విగ్గీ సేవలను నిలిపివేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.