ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ విధించిన ఛైర్మన్ మోషేన్ రాజు

AP Legislative Council Chairman Moshen Raju Suspends TDP Members From The House, AP Legislative Council Chairman Moshen Raju, AP Legislative Council Chairman, Moshen Raju, Legislative Council Chairman Moshen Raju Suspends TDP Members From The House, Moshen Raju Suspends TDP Members From The House, TDP Members From The House, TDP Members, Andhra Pradesh Legislative Council Chairman, Andhra Pradesh Legislative Council Chairman Koyye Moshenu Raju, Andhra Pradesh Legislative Council, Andhra Pradesh Legislative Council Latest Updates, Andhra Pradesh Legislative Council Latest News, Andhra Pradesh, Mango News, Mango News Telugu,

ఏపీ శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమవగానే, రాష్ట్రంలో మ‌ధ్య నిషేధం అమ‌లుపై చ‌ర్చించాలని పట్టుబడుతూ తెలుగుదేశం శాసనసభా పక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చ‌ర్చించ‌డం కోసం సభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే టీడీపీ స‌భ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా నినాదాలు చేస్తూ ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకున్నారు. టీడీపీ సభ్యులు చిడతలు వాయించి, విజిల్స్ వేస్తూ నిరసన తెలిపారు. ఛైర్మన్ హెచ్చరించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. ఒకదశలో మార్షల్స్ కూడా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.

ఈ గందరగోళం మధ్య వ్య‌వ‌సాయ మంత్రి క‌న్న‌బాబు కలగజేసుకుని టీడీపీ స‌భ్యులు సభలో అంతరాయం కలిగిస్తున్నారని, దీనివలన విలువైన సభా సమయం వృధా అవుతోందని తెలుపుతూ వారిని స‌స్పెండ్ చేయాల్సిందిగా ఛైర్మన్ మోషేన్ రాజుకు ప్ర‌తిపాదించారు. ఈ ప్రతిపాదనను మరో మంత్రి సిదిరి అప్పలరాజు బలపరిచారు. టీడీపీ స‌భ్యులు స‌భ గౌర‌వాన్ని దెబ్బ‌తీస్తున్నారని, ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తున్నారని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. ఛైర్మన్ మోషేన్ రాజు కూడా టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన సభ్యులు ఇలా అమర్యాదగా ప్రవర్తించటం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను ఒక రోజు స‌స్పెండ్ చేశారు. వీరిలో టీడీపీ ఎమ్మెల్సీలు దీప‌క్ రెడ్డి, అంగ‌ర రామ్మెహ‌న‌రావు, బ‌చ్చుల అర్జ‌నుడు, కె ఇ ప్ర‌భాక‌ర్, అశోక్ బాబు, దువ్వార‌పు రామారావు, రాజ‌న‌ర్సింహులు తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − three =