కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బద్వేలు ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ పేరును టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖరే పోటీ చేశారు.
ముందుగా శుక్రవారం నాడు బద్వేలు ఉప ఎన్నికపై చంద్రబాబు కడప జిల్లా నేతలు, స్థానిక నాయకులతో సమీక్ష నిర్వహించారు. నాయకుల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఓబుళాపురం రాజశేఖర్ పేరును ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నాయకులు అంతా సమష్టిగా పనిచేయాలని, బద్వేలులో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ