
కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌లో పొత్తుల లెక్కలు తేలక టీడీపీ, జనసేన కూటమి అభ్యర్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రి రూరల్ నుండి టీడీపీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నా.. పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరిక మీద జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్‌కు ఇవ్వడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకున్నారు.
దీంతో ఇటీవల రాజమండ్రి వెళ్లిన పవన్ ఇదే విషయాన్ని జనసేన వర్గీయులకు చెప్పడంతో కందుల దుర్గేష్‌కు రూట్ క్లియర్ అన్న వార్తలు వినిపించాయి. కానీ దీనికి బుచ్చయ్య ఒప్పుకోకపోవడంతో..ఎన్నికల ముందు సీనియర్లు అలిగితే పార్టీకి నష్టమని భావించిన చంద్రబాబు పవన్‌ను ఒప్పించడం.. పవన్ దుర్గేష్‌కు సర్ధిచెప్పడంతో ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది.
తాజాగా టీడీపీ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. రాజమండ్రి రూరల్, నిడదవోలు తెలుగు దేశం పార్టీ,జనసేన ఉమ్మడి అభ్యర్థుల విషయంలో అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చిందని చెప్పారు. పొత్తులో టీడీపీ, జనసేన మధ్య టికెట్లు విషయమై ఎటువంటి విభేదాలు లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు . అంతేకాదు రాజమండ్రి రూరల్ నుంచి కూటమి అభ్యర్థిగా తానే పోటీ చేస్తానంటూ బుచ్చయ్య ప్రకటించారు. ఇప్పటి వరకూ రేసులో ఉన్న కందుల దుర్గేష్..నిడదవోలు నుంచి పోటీ చేస్తారని చెప్పారు. దీనిపై టీడీపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థుల రెండో జాబితాలో పేర్లు ఖరారు చేస్తారని తెలిపారు.
రాబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన పొత్తులో సామరస్యంగా ముందుకు వెళ్తామని బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ ఎన్నికలలో టీడీపీ- జనసేన కూటమి అభ్యర్థులదే విజయమని గోరంట్ల ధీమా వ్యక్తం చేశారు. ముందు ముందు టీడీపీ, జనసేన కూటమి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా.. తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. పొత్తులో టిక్కెట్లు విషయంపై ఇప్పుడు తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని.. అందరం కలిసే ఈ ఎన్నికల్లో పోటీకి వెళ్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ఈ సారి జగన్‌ను ఓడించడమే టీడీపీ,జనసేన కూటమి ప్రధాన లక్ష్యమని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY