ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

AP News, Chandrababu Naidu, Chandrababu Naidu Latest News, Chandrababu Writes Open Letter over YCP Govt’s One-year Rule, Chandrababu Writes Open Letter to AP People, TDP Chief Chandrababu, TDP President Chandrababu Naidu, YCP Government, YCP Govt One-year Rule

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జూన్ 11, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేఖ రాశారు. ఈ మేరకు తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో ఆ లేఖ జతచేసి వైసీపీ ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తారు. “దేశమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలుచేస్తోంటే, ఏపీలో మాత్రం సీఎం జగన్ తన సొంత ‘రాజారెడ్డి రాజ్యాంగం’ అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. దేశ చరిత్రలోనే ఇంతటి రాక్షసపాలన, విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదు. వైసీపీ దుర్మార్గాల వల్ల రాష్ట్రానికి జరిగిన కీడు, ప్రజలకు కలిగిన చేటు గురించి మీ దృష్టికి తెచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నాను. వైసీపీ పాలకుల నైజాన్ని ప్రజలే చక్కదిద్దాలి. న్యాయాన్ని, చట్టాన్నీ కాపాడటంలో, రాజ్యాంగాన్ని రక్షించడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. ప్రజల ప్రాధమికహక్కుల పరిరక్షణకోసం గత ఏడాదిగా తెలుగుదేశం చేస్తోన్న రాజీలేని పోరాటంలో రాజకీయాలకు అతీతంగా కలిసివచ్చిన వారందరినీ అభినందిస్తున్నాను. ఇకపై కూడా రాష్ట్ర ప్రయోజనాలను, భావితరాల భవిష్యత్తును కాపాడే కృషిలో మీరంతా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నానని” చంద్రబాబు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu