ఏపీలో 5 లక్షలు దాటినా కరోనా పరీక్షలు, మిలియన్‌ జనాభాకు 9,557 కరోనా పరీక్షలు

5 Lakh Plus Samples Tested Till Now in Andhra Pradesh, 5 Lakh Plus Samples Tested Till Now in AP, Andhra Pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP Coronavirus Testing Laboratories, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Tests, Coronavirus Tests In AP, COVID-19

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో 5 లక్షలకు పైగా పరీక్షలను నిర్వహించింది. ఇప్పటివరకు 5,10,318 సాంపిల్స్ కి కరోనా పరీక్షలు చేసి  దేశంలోనే మొదటిస్థానంలో‌ నిలిచింది. ప్రతి పది లక్షల (మిలియన్‌) జనాభాకు 9,557 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఏపీలో కరోనా వైరస్ నుంచి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య 54.67 శాతానికి పెరిగింది.

మరోవైపు జూన్ 11, గురువారం నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5429 కు చేరింది. మొత్తం కేసుల్లో రాష్ట్రంలో నమోదైనవి 4261 కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 971, విదేశాల నుంచి వచ్చిన వారు 197 మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2540 కు చేరగా, మరణాల సంఖ్య 80 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1641 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + four =