తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ కైవసం, చైర్‌ పర్సన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నిక

JC Prabhakar Reddy, JC Prabhakar Reddy Elected as Tadipatri Municipality Chairperson, Mango News, Tadipatri, Tadipatri Chairman, Tadipatri Chairman Election, Tadipatri Election News, Tadipatri Municipality, Tadipatri Municipality Chairperson, Tadipatri Municpal Chairman Election, Tadipatri Municpal Chairman Election News, Tadipatri Municpal Chairman Election Result, TDP Leader, TDP Leader JC Prabhakar Reddy, TDP Leader JC Prabhakar Reddy Elected as Tadipatri Municipality Chairperson

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, 75 మున్సిపాలిటీలకు చైర్‌ పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు గురువారం నాడు జరిగాయి. ఈ నేపథ్యంలో తాడిపత్రి ఛైర్మన్ పీఠం విషయంలో నెలకున్న ఉత్కంఠకు తెరపడింది. తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ రోజు జరిగిన ఎన్నికలో చైర్‌ పర్సన్ గా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా సరస్వతి ఎన్నికయ్యారు. తాడిపత్రిలో మొత్తం 36 వార్డుల్లో టీడీపీ 18, వైఎస్సార్సీపీ 16, సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 గెలుచుకున్నారు. కాగా సీపీఐ, ఇండిపెండెంట్ మద్దతుతో 20 మంది అభ్యర్థుల బలముండడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్య ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు నమోదు చేసుకున్నప్పటికీ వారి సభ్యుల బలం 18 గానే ఉంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో గతకొన్ని రోజులుగా తాడిపత్రిలో రాజకీయాలు వేడెక్కగా, చైర్‌ పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ