కరోనా పరీక్షలు: దేశంలో అత్యధిక ప్రభుత్వ ల్యాబ్స్ ఏపీలోనే…

ap corona tests, AP Coronavirus, AP Coronavirus Testing Laboratories, AP Coronavirus Updates, AP Highest Number of Government-Run Labs Testing for COVID-19, corona tests in ap, Corona Tests In Private Labs, coronavirus test labs, Coronavirus Tests In AP, Coronavirus Tests Lab, Government-Run Labs Testing for COVID-19

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ ల్యాబ్స్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందంజలో నిలిచింది. జూన్ 3 నాటికీ దేశవ్యాప్తంగా 480 ప్రభుత్వ ల్యాబ్స్, 208 ప్రైవేట్ ల్యాబొరేటరీస్ లలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతుండగా, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 52 ప్రభుత్వం ల్యాబ్స్ ఉండడం విశేషం. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైన మార్చ్ నాటికీ 0 ల్యాబ్స్ ఉండగా, ప్రస్తుతం 52 ప్రభుత్వ ల్యాబ్స్ లతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇక ఏపీలో ఐసిఎంఆర్ ఆమోదించిన నాలుగు ప్రైవేట్ ల్యాబొరేటరీస్ లలో కూడా కరోనా వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణలో 9 ప్రభుత్వ ల్యాబ్స్ మరియు 16 ప్రైవేట్ ల్యాబ్స్ లలో కరోనా వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =