జూనియర్‌ రెజ్లర్‌ రితికా ఫోగాట్‌ ఆత్మహత్య!

Babita Phogat Cousin Commits Suicide, Junior Wrestler Ritika Phogat, Junior Wrestler Ritika Phogat Allegedly Commits Suicide, Junior Wrestler Ritika Phogat Commits Suicide, Mango News, Ritika Phogat, Ritika Phogat Allegedly Commits Suicide, Ritika Phogat Commits Suicide, Ritika Phogat death, Ritika Phogat death case, Ritika Phogat Suicide News

జూనియర్‌ రెజ్లర్‌ రితికా ఫోగాట్ (17) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. హర్యానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో స్టార్ రెజ్లర్లుగా పేరుగాంచిన గీతా ఫోగాట్, బబితా ఫోగాట్ లకు రితికా ఫోగాట్  బంధువు అవుతుంది. రితికా ఫోగాట్‌ గత 5 సంవత్సరాలుగా దిగ్గజ రెజ్లర్ మహావీర్‌ ఫోగాట్‌ అకాడమీలో రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల మార్చి 12 నుంచి 14 మధ్య రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలో ఆమె పాల్గొంది. ఈ రెజ్లింగ్ టోర్నమెంట్ ఫైనల్లో తృటిలో ఓడిపోయినందుకు రితికా ఫోగాట్ కలతచెంది ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. రితికా ఫోగాట్ మరణంతో ఫోగాట్ కుటుంబంలో విషాదం నెలకుంది. రితికా చాలా సమర్థవంతురాలైన రెజ్లర్ అని, ఆమె ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియడం లేదని ఫోగాట్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + three =