మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్, రాజమండ్రి జైలుకు తరలింపు

Andhra Pradesh, AP Minister Perni Nani, AP News, Kollu Ravindra Taken into Police Custody, Police Arrested TDP Leader Kollu Ravindra, TDP Leader Kollu Ravindra, TDP Leader Kollu Ravindra 14 days Remand, TDP Leader Kollu Ravindra Arrested, TDP Leader Kollu Ravindra has Sent to Rajahmundry Jail

వైస్సార్సీపీ నేత, మచిలీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కర్‌రావు హత్య కేసులో టీడీపీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టైన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం కొల్లు రవీంద్రను పోలీసులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. వాదనలు అనంతరం 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

ముందుగా కొల్లు రవీంద్రను జూలై 3, శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.శుక్రవారం నాడు మచిలీపట్నం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కొల్లు రవీంద్రను తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని సీతారామపురం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైస్సార్సీపీ నాయకుడు మోకా భాస్కర్‌ రావు ఇటీవలే మచిలీపట్నంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో కొల్లు రవీంద్రపై నాలుగో నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హత్య చేసినట్టు నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu