కాళేశ్వరంలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో ప్యాకేజీ 9 పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష

Kaleshwaram Project, kaleshwaram project updates, kaleshwaram project works, KTR, KTR Latest News, Minister KTR, Minister KTR Reviewed Package 9 Works, Package 9 Works in Sircilla District, Package 9 Works in Sircilla District under Kaleshwaram Project

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపడుతున్న ప్యాకేజీ 9 పనులపై జిల్లా కలెక్టర్ మరియు నీటిపారుదల శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. వచ్చే అక్టోబర్ నెలాఖరు నాటికి మిడ్ మానేరు జలాశయం నుండి అప్పర్ మానేరు జలాశయాంలోకి గోదావరి జలాలతో నింపుతామన్నారు.

అప్పటిలోగా ప్యాకేజీ 9 సంబంధించి ప్రధాన కాలువల, డిస్ట్రిబ్యూషన్ కాలువల భూసేకరణ, కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. తద్వారా ప్యాకేజీ 9 ద్వారా 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు జలాలను అందించే వీలు కలుగుతుందని మంత్రి కేటిఆర్ తెలిపారు. అలాగే జిల్లాలోని 666 చెరువులను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కేటిఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here