పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు అయ్యాక కూడా ఎందుకీ గొడవలు, కారణాలేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కౌంటింగ్ తర్వాత పరిణామాలపై అనుమానాలు వ్యక్తం కావడానికి ఈ గొడవలూ ఓ కారణంగా తెలుస్తోంది. ఈక్రమంలోనే కేంద్రబలగాలు భారీ ఎత్తున ఏపీలో మొహరించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉండే ప్రాంతాల్లో మొహరించనున్నారు. ఇప్పటికే తిరుపతికి మరో నాలుగు కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు చేరుకున్నాయి. ఈలోగా హింసకు పాల్పడిన వారిని, పాల్పడతారన్న అనుమానం ఉన్నం వారిని అందరినీ గుర్తించి అదుపులోకి తీసుకునే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు ఈ హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ.. సీఎస్, డీజీపీలను పిలిచి ఇప్పటికే మాట్లాడిన విషయం తెలిసిందే.
సీఎస్, డీజీపీలతో భేటీ అయిన తర్వాత ఏర్పడిన సిట్.. తన విచారణను వేగవంతం చేసింది. అల్లర్ల వెనుక ఉన్న ప్రజాప్రతినిధులను గుర్తించి అరెస్టు చేసేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు నిర్లక్ష్యం వహించిన, కొందరు నేతలకు ఒత్తాసు పలికిన అధికారులపై కూడా చర్యలకు సిద్ధం అవుతున్నారు. ఈక్రమంలోనే చంద్రగిరి, తిరుపతిలో పోలింగ్ రోజు, ఆ తరువాత రోజు జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో తిరుపతి ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్‌తో పాటు మరో నలుగురు పోలీస్ అధికారులపై వేటు వేసింది. ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్‌ను బదిలీ చేసిన ఈసీ తిరుపతి డీఎస్‌పీ సురేంద్ర రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్ పీ భాస్కర్ రెడ్డి, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ రాజశేఖర్ సస్పెండ్ చేసింది.
హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లోనూ సిట్ పర్యటిస్తోంది. ప్రస్తుతం అక్కడి వాతావరణం ఎలా ఉందో గుర్తించి, తగిన భద్రతా చర్యలు చేపడుతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, రామచంద్రపురం మండలం బ్రాహ్మణ కాలువ పోలింగ్ కేంద్రంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతాలను పరిశీలించింది. మాచర్లలోనూ రాజకీయ పరిస్థితులపై నిఘా పెట్టింది. పోలింగ్ ముగిశాక ఈ నెల 14 న తిరుపతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద రణరంగమే జరిగింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేసిన వైసీపీ కేడర్ దాడి చేయగా పోలీసు వాహనంతో పాటు, ఇతరుల వాహనాలు ధ్వంసం చేసి తగుల పెట్టారు టిడిపి శ్రేణులు. ఇలా దాడులు ప్రతి దాడులు జరగ్గా వరుస హింసాత్మక ఘటనలకు పోలీసుల వైఫల్యమే కారణమని ఈసీ భావించింది. దీనిలోభాగంగానే తిరుపతి ఎస్పీని డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన ఈసీ.. ఇద్దరు డిఎస్పీలు మరో ఇద్దరు సీఐల సస్పెండ్ చేయడంతో పోలీసు యంత్రాంగం ఆందోళన చెందుతోంది. మరి కొందరిపై వేటుకు అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆ జాబితాలో ఎవరు ఉంటారని అల్లర్లు జరిగిన ప్రాంతాల పరిధిలోని పోలీసు అధికారులు గుబులు చెందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY