ఎవరు అవును అన్నా.. ఎవరు కాదన్నా ఏపీ, తెలంగాణలో జగన్, కేసీఆర్ ప్రభుత్వాలు పడిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగమే. అవును..ఆంధ్ర ,తెలంగాణాలో గత ప్రభుత్వాలు నిరుద్యోగులను ఏ మాత్రం పట్టించుకోలేదు.ఇటు కేసీఆర్..అటు జగన్ ఇద్దరూ కూడా నిరుద్యోగులకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చిన వాళ్లే. కానీ గడిచిన ఐదేళ్లలో నిరుద్యోగుల మాటే మరిచిపోయినట్లు ప్రవర్తించడంతో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు.
లక్షలాది మంది నిరుద్యోగులు తమ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ ఇవ్వండి మహాప్రభో అంటూ ధర్నాలు ,ర్యాలీలు చేసినా సరే గత ప్రభుత్వాలు అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదు. తెలుగు రాష్ట్రాలలోని నిరుద్యోగులలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు లక్షలాది మంది ఉన్నారు. గత ప్రభుత్వాలు ఉపాధ్యాయ వృత్తి కోసం ఎదురుచూసే నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించి కూడా.. ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదు.
ఎన్నికలు సమీపిస్తున్న రెండు ,మూడు నెలల్లో తక్కువ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి చేతులు దులుపేసుకున్నారు.చివరకు ఎన్నికలు సమీపించడంతో ఆ పరీక్ష కూడా నిర్వహించలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం కూడా నిరంతరం తగ్గడంతో ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోతున్నాయి.గత ప్రభుత్వాలు వీటిపై అసలు దృష్ఠి పెట్టకపోవడంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యాయి.
కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ,చంద్రబాబు ప్రభుత్వాలు మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకే పెద్ద పీట వేస్తూ చర్యలు చేపట్టారు.వీరిద్దరూ కూడా నిరుద్యోగులకు తాము అండగా నిలుస్తామని హామీ కూడా ఇచ్చారు. హామీ ఇచ్చినట్లుగానే తాజాగా ఈ రెండు ప్రభుత్వాలు భారీగా ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసారు. త్వరలోనే డీఎస్సీ పరీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా సెలక్షన్ ప్రాసెస్ కూడా పూర్తి చేయనున్నారు.
అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలతో పాటు.. గ్రూప్స్ ఉద్యోగాల కోసం కూడా విడతల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రయివేట్ ఉద్యోగాల కల్పనలో కూడా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందడుగు వేస్తున్నారు. తమ రాష్ట్రాలలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడానికి తగిన చర్యలు తీసుకోబోనున్నారు. ప్రస్తుతం ఇలా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు నిరుద్యోగంపై పూర్తి దృష్ఠి సారించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE