తిరుపతి జిల్లాలో 20 వేల మందికి ఉపాధి కల్పించే పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన సీఎం జగన్‌

AP CM YS Jagan Mohan Reddy Inaugurates and Lays Foundation Stones For Several Projects During Tirupati Visit, CM YS Jagan Inaugurates and Lays Foundation Stones For Several Projects During Tirupati Visit, AP CM YS Jagan Inaugurates and Lays Foundation Stones For Several Projects During Tirupati Visit, CM YS Jagan Mohan Reddy Inaugurates and Lays Foundation Stones For Several Projects During Tirupati Visit, Foundation Stones For Several Projects, AP CM YS Jagan Inaugurates Foundation Stones For Several Projects, Tirupati Tour, AP CM YS Jagan Tirupati Visit, AP CM YS Jagan Tirupati Tour, AP CM YS Jagan Tirupati Tour News, AP CM YS Jagan Tirupati Tour Latest News, AP CM YS Jagan Tirupati Tour Latest Updates, AP CM YS Jagan Tirupati Tour Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో బిజీ బిజీగా గడిపిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సుమారు 20 వేల మందికి ఉపాధి కల్పించే పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత తిరుపతిలో వకుళామాత ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ రూ. 700 కోట్లతో అపాచీ పెద్ద పరిశ్రమను స్థాపించనుందని, మొదటి దశలో రూ. 350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్ల పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. అపాచీ పరిశ్రమలో ఆడిడాస్‌ షూలు, లెదర్‌ జాకెట్స్‌, బెల్ట్‌లు వంటి ఉత్పత్తులు తయారుచేయనున్నారని చెప్పారు. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు 10 వేల మందికి ఉపాధి కలుగనుందని, వీటిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే రానున్నాయని సీఎం జగన్ వెల్లడించారు.

అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో సన్నీ ఆప్కోటిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ప్రారంభించారు. రూ. 254 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు అవుతున్న ఈ కంపెనీ మొబైల్‌ ఫోన్‌ కెమెరా లెన్స్‌లను తయారు చేస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్‌ కంపెనీలకు ఇది కెమెరాలను సరఫరా చేయనుందని, దీని ద్వారా 3 వేల మందికి ఉద్యోగ అవకాశం కలగనుందని పేర్కొన్నారు. అలాగే మొత్తం ఈ క్లస్టర్‌లో మూడు ప్రాజెక్టులను ప్రారంభించామని, మరో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. టీసీఎల్‌ యూనిట్‌ను ప్రారంభించామని, దీని ద్వారా ద్వారా 2 వేల మందికి, ఫాక్స్‌ లింగ్‌ కంపెనీ ద్వారా మరో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. మొత్తంగా ఈరోజు పాల్గొన్న వివిధ పరిశ్రమల కార్యక్రమాల ద్వారా రానున్న రోజుల్లో 20 వేల మందికి ఉపాధి కలుగనుందని సీఎం జగన్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 10 =