ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకి రూ.250 కోట్లు భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో భారీ మెజారితో అధికారం దక్కించుకున్న ఆయన పథకాల అమలుపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డేటా ఆధారిత వివరాలను సేకరిస్తున్నారు. ఓ వైపు అభివృద్ధి పనులను చేపడుతూనే హామీలపై ఆయన ఫోకస్ పెట్టారు. ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటకకు వెళ్లి అధికారులు అధ్యయనం చేశారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
వాస్తవానికి అధికారంలోకి వచ్చి రెండు నెలలవుతున్నా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు బస్సు పథకం ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ కార్యక్రమంపై కసరత్తు ప్రారంభించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపైనే చర్చిస్తారు. ఏపీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌తో పాటు విజయవాడ, విశాఖలోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసులలో ఉచిత సదుపాయం కల్పించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేయనుంది.
ప్రస్తుతం 70 శాతం ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ఆక్యుఫెన్సీ రేషియో.. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తే 95 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ జరిగే రివ్యూలో విధివిధానాలు ఎప్పటినుంచి అమలు చేసే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అదే రోజు అన్నా క్యాంటిన్లను కూడా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE