పోలీసుల అదుపులో ఆరుగురు మైనర్లు

The Investigation In The Case Of Attack On CM Jagan, Attack On CM Jagan, Investigation On CM Jagan Attack Case, Attack On CM Jagan, Police Custody, Throwing Stones, YCP, TDP, Janasena, Chandrababu, Jagan, Pawan Kalyan, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
attack on CM Jagan, police custody,throwing stones,YCP, TDP, Janasena, Chandrababu, Jagan, Pawan Kalyan

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది..? దాడిపై అధికారులు ఏం చెబుతున్నారనే చర్చ ఏపీ వ్యాప్తంగా జోరుగా నడుస్తోంది. అయితే సీఎం జగన్‌పై దాడి కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజయవాడలోని వడ్డెరకాలనీకి చెందిన పది మంది యువకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అనుమానితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో.. సంతోష్ అనే యువకుడు తానే దాడి చేసినట్టుగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా బయటకు చెప్పకపోయినా.. దాడి వెనుక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. బెజవాడ సీసీఎస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో.. పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల అదుపులోకి తీసుకున్నవారిలో ఆరుగురు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు 20 టీమ్‌లుగా విడిపోయి దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు..ఇప్పటివరకూ సుమారు 70 మందిని ప్రశ్నించారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను కూడా సైబర్ ల్యాబ్స్‌కు పంపారు. వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి ప్రాంతాన్ని కూడా పోలీసులు పరిశీలించి..దాడి జరిగిన సింగ్ నగర్ స్కూల్ పరిసరాల్లో వివరాలను సేకరించారు. అంతే కాకుండా అనుమానితుల సెల్ ఫోన్ డేటాను తెప్పించి కేసును ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇన్‌కమింగ్‌, ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ వివరాలను తెప్పించి, వాటిని పరిశీలిస్తున్నారు. వాటిలో అనుమానాస్పదంగా ఉండే కాల్స్‌, ఒకే నంబరు నుంచి ఎక్కువసార్లు వెళ్లిన ఫోన్లపై పోలీసులు దృష్టి పెట్టారు.

మరోవైపు వడ్డెర కాలనీ వాసులు ..విచారణ పేరుతో తమ పిల్లల్ని పోలీసులు అన్యాయంగా తీసుకెళ్లారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితులను పట్టుకునేందుకు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు.ఇటు విజయవాడలో ముఖ్యమంత్రిపై గులక రాయి దాడి ఘటనపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ కోన తాతారావు ఎలక్షన్ కమిషన్‌కు తమ లేఖను అందజేశారు. ఇందులో రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్, సీఎం భద్రతా అధికారినీ బాధ్యులను చేయాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ చేయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY