ఏపీలో మహిళల రక్షణ కోసం, కొత్తగా 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

AP CM YS Jagan Mohan Reddy Launches 163 New Disha Patrolling Vehicles For Women's Protection, AP CM YS Jagan Mohan Reddy Launches 163 New Disha Patrolling Vehicles, New Disha Patrolling Vehicles For Women's Protection, 163 New Disha Patrolling Vehicles, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM YS Jagan, New Disha Patrolling Vehicles, New Disha Patrolling Vehicles Latest News, New Disha Patrolling Vehicles Latest Updates, New Disha Patrolling Vehicles Live Updates, Disha Patrolling Vehicles, Patrolling Vehicles, Women's Protection, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం కొత్తగా 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికి ఎలాంటి అన్యాయం జరిగినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. మహిళల భద్రత కోసం దిశ పోలీస్‌స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయి. మరో 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.

అలాగే మన రాష్ట్రంలో ఇప్పటికే 1.16 కోట్ల మంది మహిళలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని సీఎం జగన్‌ అన్నారు. వారికి ఎలాంటి కష్టమొచ్చినా అందులో తెలియజేయొచ్చు. ఈ దిశ పెట్రోలింగ్‌ వాహనాలు జీపీఎస్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌కి అనుసంధానమై ఉంటాయి. ఎక్కడ ఎవరికీ ఏ ఆపద కలిగినా పట్టణాల్లో అయితే కేవలం 5 నిమిషాల్లో, గ్రామాల్లో అయితే 10 నిమిషాల్లో దిశ సిబ్బంది చేరుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇంకా ఇందులో పనిచేసే మహిళా సిబ్బంది కోసం ప్రత్యేకంగా 18 దిశ మొబైల్ విశ్రాంతి వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు దిశ పెట్రోలింగ్‌ వాహనాల కోసం రూ. 13.85 కోట్లు, రెస్ట్‌ రూమ్స్‌కి రూ. 5.5 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =