తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూత

AP News, Balli Durga Prasad Passes Away, Lok Sabha MP Balli Durga Prasad Rao passes away, MP Balli Durga Prasad Passes Away, MP Balli Durga Prasad Rao, Tirupati Lok Sabha MP Balli Durga Prasad Rao, Tirupati MP Balli Durga Prasad, Tirupati MP Balli Durga Prasad Passes Away

వైసీపీ నేత, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు కరోనా‌ పాజిటివ్ గా తేలడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అలాగే కొద్దికాలంగా గుండె సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈరోజు బల్లి దుర్గాప్రసాద్‌కు తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

బల్లి దుర్గాప్రసాద్‌ స్వస్థలం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రాధమిక విద్యా శాఖ మంత్రిగా కూడా ఆయన సేవలనందించారు. అనంతరం 2019 ఎన్నికల ముందు వైసీపీ లో చేరి తిరుపతి ఎంపీగా విజయం సాధించారు. బల్లి దుర్గాప్రసాద్‌ మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్‌ కుమారుడితో సీఎం వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఎంపీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే బల్లి దుర్గాప్రసాద్‌ మృతి పట్ల పలువురు వైసీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu