గుంటూరు పర్యటనలో సీఎం జగన్‌, మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలకు హాజరు

CM YS Jagan Participates Minorities Welfare Day Celebrations at Guntur Today,CM YS Jagan ,Minorities Welfare Day Celebrations,Minorities Welfare Day,Minorities Welfare Day Celebrations at Guntur,Mango News,Mango News Telugu, AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులోని సుగంధ ద్రవ్యాల పార్కులో నూతన మిర్చి ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు. సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో రూ.250కోట్ల రూపాయలతో ఐటిసి సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. ఇక అనంతరం గుంటూరు చేరుకొని గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటుచేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ముందుగా స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ ముస్లిం మైనారిటీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈరోజు మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం సంతోషమని పేర్కొన్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలలోని పెదాలను గుర్తించి వారికి తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. దానిని కొనసాగిస్తూ వైసీపీ ప్రభుత్వం కూడా మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, రాజకీయంగా ఆయా వర్గాల వారికి ఎన్నో పదవులు అందించిందని సీఎం జగన్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పదవి, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి ఎంతోమందిని ప్రోత్సహించిందని వెల్లడించారు. మూడేళ్ళలో మైనారిటీలకు డీబీటీ ద్వారా రూ. 10,309 కోట్లు అందించామని, అలాగే నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 10,000 కోట్లు ఇచ్చామని తెలియజేశారు. ఇంకా రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డుకు చెందిన 580 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని, ఇది మైనారిటీల ప్రభుత్వమని గుర్తించాలని సీఎం జగన్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 11 =