తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో (ఎఫ్‌ఏసీ) గా ఏవీ ధర్మారెడ్డి కొనసాగనున్నారు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ అధికారి అయిన ఏవీ ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ను మరో రెండేళ్ల పాటుగా పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన డిప్యుటేషన్ పై మరో రెండేళ్లు ఏపీ సర్వీసులోనే కొనసాగనున్నారు. ముందుగా మే 14, 2022తో ఏవీ ధర్మారెడ్డి డిప్యుటేషన్ పై రాష్ట్ర సర్వీసులోకి వచ్చి ఏడేళ్లు పూర్తయింది. దీంతో ఆయన డిప్యుటేషన్ ను మరోసారి పొడిగించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఇటీవలే విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే కేంద్రం సానుకూలంగా స్పందించి మే 14, 2022 నుంచి రెండేళ్లపాటుగా ఏవీ ధర్మారెడ్డి డిప్యుటేషన్ కొనసాగుతుందని ఉత్తర్వులిచ్చింది. టీటీడీలో అదనపు ఈవోగా, ఈవోగా ఏవీ ధర్మారెడ్డి పలు సంస్కరణలు తీసుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY