విజయవాడ నగరంలో ఆలయాల పునర్నిర్మాణానికి రేపు సీఎం జగన్‌ శంకుస్థాపన

Andhra Pradesh to rebuild temples, AP CM YS Jagan, AP CM YS Jagan To Lay Foundation Stone, AP Temple News, Foundation Stone for Temples in Vijayawada City, Mango News Telugu, Reconstruction Of Temples, Reconstruction Of Temples In AP, Sp Temple Vandalism Issue, Temple Vandalism Issue, Temple Vandalism Issue in AP

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం 11:01 నిమిషాలకు విజయవాడ నగరంలో పలు ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన 9 ఆలయాల పునర్నిర్మాణ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ నిర్వహించనున్నారు. అలాగే రూ.77 కోట్లతో చేపట్టనున్న దుర్గగుడి అభివృద్ధి పనులను కూడా సీఎం ప్రారంభించనున్నారు.

విజయవాడ నగరంలో రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయం, రూ.70 లక్షలతో రాహు-కేతు ఆలయం, రూ.31.5 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయం, రూ.20 లక్షలతో కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, రూ.20 లక్షలతో దుర్గగుడి మెట్ల వద్ద శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, రూ.10 లక్షలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం, రూ.10 లక్షలతో పోలీస్‌ కంట్రోల్‌ రూం సమీపంలో వీరబాబు ఆలయం, రూ.9.5 లక్షలతో సీతమ్మ పాదాలు ఆలయం, రూ.8 లక్షలతో బొడ్డుబొమ్మ ఆలయం పునర్నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − ten =