ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, వైఎస్ఆర్(కడప) జిల్లా రాయచోటికి చెందిన మైనారిటీ మహిళా నేత జకియా ఖానమ్ లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిర్ణయించారు. అనంతరం వారిద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ కు సమర్పించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu