ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం, యాంటీబాడీలు పెరుగుదల

coronavirus vaccine, Coronavirus vaccine latest update, COVID-19 vaccine AZD1222, Oxford COVID-19 Vaccine, Oxford COVID-19 Vaccine Trials, Oxford COVID-19 Vaccine Trials are Successful, Oxford vaccine for novel coroanvirus safe, Phase 1 and 2 of Oxford COVID-19 Vaccine, Phase 1 and 2 of Oxford COVID-19 Vaccine Trials are Successful

ప్రస్తుతం ప్రపంచవ్యాపంగా పలు దేశాలను కోవిడ్-19 వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కరోనాకు వ్యాక్సిన్ తయారీలో పలు ఫార్మా సంస్థలు నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను నమోదు చేస్తూ విజయవంతమైనట్టుగా తెలిసింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఔషధ సంస్థ అస్ట్రా జెనెకాతో కలిసి సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ యొక్క మొదటి, రెండో దశల క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు విజయవంతంగా వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగించిన వారిలో యాంటీబాడీలు పెరిగి, వైరస్ ను నిరోధించేలా రోగనిరోధక శక్తి పెరుగుతున్నట్లుగా గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అలాగే ఈ వ్యాక్సిన్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు.

ఈ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన ఫలితాలు తాజాగా లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. “ఆక్స్‌ఫర్డ్‌ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఫేజ్ 1, 2 దశల ప్రయోగ ఫలితాలు ప్రచురించబడ్డాయి. వ్యాక్సిన్‌ సురక్షితం మరియు ఇమ్యునోజెనిక్. పెడ్రో ఫోలేగట్టి మరియు సహచరులకు అభినందనలు. ఈ ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని” అని లాన్సెట్‌ జర్నల్‌ ఎడిటర్‌ రిచర్డ్‌ హోర్టన్‌ ట్విట్టర్ లో వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + seventeen =