
ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయితే.. ఓటరు నాడి ఎవరికీ అంతుపట్టడం లేదు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేశామని చెబుతున్నారు. సరైన సమాదానం తెలియక అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. పోలింగ్ ముగిశాక ప్రతిసారీ ఓ అంచనాకు వచ్చేవారు. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ శాతం అంతంత మాత్రమే ఉండడంతో ఓటరు నాడి తెలియడం లేదు. సైలెంట్ ఓటింగ్ బాగా జరిగింది. చాలామంది కుటుంబసభ్యులకు కూడా చెప్పడం లేదు. గతంలో ఒక పార్టీకి ఎక్కువ ఓట్లు పడితే బయట కార్యకర్తలు హంగామా చేసే పరిస్థితి ఉండేది. పోలింగ్ స్టేషన్ సమీపంలో టేబుల్స్ వేసుకొని కూర్చున్న వారిలో ముఖాల్లో సంతోషం కనిపించేది. తమ పార్టీ గెలుస్తుందనే నమ్మకానికి వచ్చే వారు. ఏజెంట్‌లు ఎప్పటికప్పుడు కార్యకర్తలకు సమాచారం చేరేవేసే వారు. తమకు అంతుపట్టలేదని ఏజెంట్లు చెబుతుండడంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు.
అయితే.. ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం.. గెలుపు మాది అంటే.. మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రానున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా మారుతుందని చెప్పారాయన. 2023 ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారని కిషన్ రెడ్డి వెల్లడించారు. యువకులు, మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 62.7శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ 65 శాతం దాటుతుందని తెలుస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పార్టీలకు అతీతంగా.. మోదీకి అండగా నిలిచారు. 2023 ఎన్నికల్లో ఇతర పార్టీలకు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారు. యువకులు, మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది… అని ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెప్పడం దగ్గర్నుంచి సెంటిమెంట్లు, మాటల తూటాలు, సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేసిన ప్రధాన పార్టీల నేతలు మాత్రం ఓటరు ఇచ్చే తీర్పు పట్ల ఎవరి ధీమాతో వారు ఉన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో తాము 14 సీట్లను గెలుచుకుంటామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. కనిష్ఠంగా 11 సీట్లు తమకే దక్కుతాయంటోంది. ఇక 2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు దక్కించుకున్న బీజేపీ.. ఈసారి రెండంకెల సీట్లను కచ్చితంగా సాధిస్తామని ధీమాగా చెబుతోంది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో డీలా పడ్డ బీఆర్‌ఎస్.. పార్టీ ఉనికిని నిలబెట్టుకునేందుకు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ తెరపైకి తెచ్చి.. 12 నుంచి 14 సీట్లు ఇస్తే తెలంగాణ తడాఖా చూపెడతామంటూ ఓటర్లను కోరారు. ఈనేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు తమను ఆదరిస్తారన్న ధీమాతో బీఆర్ ఎస్ పార్టీ ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY