
ఏపీలో ఓటుపై చైతన్యం పెరగడమో లేక ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడమో కారణం ఏదైనా కానీ ఓటు వేయడానికి మాత్రం ఓటర్లు ఎగబడుతున్నారు. పోలింగ్ ప్రారంభవడానికి ముందే క్యూలలో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో నిలబడటం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. తొలి రెండు గంటల్లోనే 10 శాతం ఓటింగ్ పూర్తవడం కూడా ఓ రికార్డటే . 2019 ఎన్నికలలో దాదాపు 80 శాతం ఓటింగ్ శాతం నమోదు అవగా..ఈ ఎన్నికలలో దాని కంటే కూడా పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇటు సీఎం జగన్ మోహన్ రెడ్డి, భారతి పులివెందులలో ఓటు వేయగా… మంగళగిరి నియోజకవర్గంలో నారా చంద్రబాబు, భువనేశ్వరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దంపతులు కూడా మంగళగిరి పరిధిలోనే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకూ అందిన రిపోర్టు ప్రకారం.. అనంతపురం జిల్లాలో 9.18%, ఏలూరులో 10 %, పిఠాపురంలో 10 %, కృష్ణాజిల్లాలో 10.8%, కడపలో 12%, సత్య సాయి జిల్లాలో 6.92%, తిరుపతిలో 8.11% ఓటింగ్ శాతం నమోదైనట్లు తేలింది. అయితే అర్బన్ ప్రాంతాల్లో యూత్, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మరోవైపు పెరుగుతున్న ఓటింగ్ శాతం ఏ పార్టీకి ప్లస్ అవుతుందా అన్న విశ్లేషణలు అప్పుడూ షురూ అయిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఓటర్లుగా నమోదైన 10 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే యువత ఓటు హక్కు పెరిగితే అది పక్కాగా కూటమికే ప్రస్ అవుతుందన్న లెక్కలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేదన్న ఆరోపణ ప్రధానంగా ఉంది. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం కొత్తగా పరిశ్రమల ఏర్పాటు చేయలేదన్న విమర్శ కూడా ఉంది.
అంతేకాదు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగలేదన్న ఆక్రోషం ఏపీ యూత్‌లో బాగా ఉంది. దీంతో యూత్ ఓటు వేయడానికి పెద్ద ఎత్తున ముందుకు రావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అయితే మహిళలు కూడా అదే విధంగా పెద్ద ఎత్తున ఓట్లు వేస్తుండడం.. తమకు కలిసి వస్తుందని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఏ పార్టీకి ఏపీ ప్రజలు పట్టం కడతారో అన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY