ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినా వెంటనే ఏపీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం తర్వాత, స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించి సభ ఎజెండా, బడ్జెట్ ప్రవేశపెట్టడం, బడ్జెట్ పై చర్చ, ప్రవేశపెట్టే బిల్లులు సహా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయాలను చర్చించనున్నారు. కాగా మార్చి 14 నుంచి 24 వరకు పది రోజుల పాటుగా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అలాగే రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 17న సభలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు బీఏసీ సమావేశం తర్వాత సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ 2023-24కి ఆమోదం తెలపడంతో పాటుగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE