కర్నూల్ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరంటే..?

YCP, kurnool, cm jagan, ycp mp candidate,YSRCP,assembly elections,Sanjeev Kumar,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News,andhra pradesh
YCP, kurnool, cm jagan, ycp mp candidate

ఎన్నికలవేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాలు, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలం.. బలగం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. నెగిటివిటీ పెరిగిన వారు ఎంతటి వారైనా సరే సహించడం లేదు. సీనియర్లను, మంత్రులను కూడా పక్కకు పెట్టేస్తున్నారు. అదే సమయంలో ఊహించని విధంగా కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నారు. పెద్ద సంఖ్యలో కొత్తవారిని ఎన్నికల బరిలోకి దింపుతున్నారు.

ఈక్రమంలో కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఓ ఐఏఎస్ అధికారిని బరిలోకి దింపాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కర్నూల్ నియోజకవర్గంలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ. దాదాపు ఆ నియోజకవర్గంలో 2 లక్షలకుపైగా మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ముందు నుంచి కూడా ప్రధాన పార్టీలన్నీ ఆ స్థానం నుంచి మైనార్టలనే బరిలోకి దింపుతున్నారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ సాహసం చేసింది. కర్నూల్ ఎంపీ స్థానం నుంచి తొలిసారి బీసీని బరిలోకి దించింది. వైసీపీ తరుపున సంజీవ్ కుమార్ పోటీ చేసి గెలుపొందారు.

త్వరలో జరగబోయే ఎన్నికల్లో సంజీవ్ కుమార్‌కు టికెట్ ఇవ్వకుండా వైసీపీ హైకమాండ్ పక్కకు పెట్టేసింది. ఆయన పనితీరు బాగోలేకపోవడం.. ప్రజాబలం తగ్గడంతో సంజీవ్‌ కుమార్‌ను సైడ్ చేసి కొత్త వారిని బరిలోకి దించాలని జగన్ అనుకుంటున్నారు. అలాగే ఈసారి ప్రయోగాలు చేయకుండా..  మైనార్టీనే పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కర్నూల్ అసెంబ్లీ స్థానాన్ని మైనార్టీకి కేటాయించిన వైసీపీ హైకమాండ్.. పార్లమెంట్ స్థానం నుంచి కూడా మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతనే బరిలోకి దించాలని చూస్తోంది.

ఈ మేరకు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పేరును వైసీపీ హైకమాండ్ పరిశీలిస్తోందట. గతంలో అహ్మద్ కర్నూల్‌లో కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ వక్ఫ్‌బోర్డు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఇంతియాజ్ అహ్మద్‌ను బరిలోకి దించడం ద్వారా కర్నూల్‌లో ముస్లిం ఓట్లు తమకే పడుతాయని.. తద్వారా ఆ స్థానంలో గెలిచి తీరవచ్చని వైసీపీ హైకమాండ్ అనుకుంటోందట. ఇప్పటికే ఇంతియాజ్‌తో కూడా ఆ అంశంపై హైకమాండ్ చర్చించినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE