రాజమండ్రి రూరల్‌లో బుచ్చయ్య చౌదరి పోటీ

Buchaiah Chaudhary ,Rajahmundry Rural,Chandrababu, Pawan Kalyan, YCP, TDP, Kandhula Durgesh,godavari,TDP-Jana Sena, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Buchaiah Chaudhary ,Rajahmundry Rural, Rajahmundry Rural,Chandrababu, Pawan Kalyan, YCP, TDP, Kandhula Durgesh

పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీతోనే ఉన్న సీనియర్ రాజకీయవేత్త గోరంట్ల బుచ్చయ్య చౌదరి..  చివరకు పంతం నెగ్గించుకుని రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ నుంచి  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కందుల దుర్గేష్ జనసేన నుంచి పోటీ చేయబోతుండగా.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అదే స్థానంపై పట్టుపట్టుకుని కూర్చున్నారు.

ఇదే విషయంపై బుచ్చయ్య చౌదరి టీడీపీ అధినేత చంద్రబాబుతో  మంతనాలు జరపగా..చివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను దీనిపై ఒప్పించారు. దీంతో అక్కడ  నుంచి  పోటీ చేయడానికి బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ అయినట్లు అయింది.  జనసేన పార్టీ నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికి రెడీ అవుతున్న కందుల దుర్గేష్‌ను.. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జనసేన పార్టీ హైకమాండ్ కోరింది.

రాజమహేంద్రవరం రూరల్ నుంచి.. కందుల దుర్గేష్ పోటీకి దిగుతారని తాజాగా తూర్పు గోదావరి  జిల్లా పర్యటనలో  స్వయాన పవన్ కళ్యాణ్  వెల్లడించారు. కానీ వారం రోజుల తర్వాత నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయమని హైకమాండ్  కందుల దుర్గేష్‌ను కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వైసీపీ నుంచి రాజమండ్రి రూరల్ బీసీ వర్గానికి చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ..ఈ  పోటీలో ఉండటంతో జనసేనాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజమండ్రి అర్బన్,రూరల్ నియోజకవర్గం నుంచి  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  రాజమహేంద్రవరం రూరల్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన..అక్కడి నుంచి మూడోసారీ కూడా పోటీ చేసి హాట్రిక్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్లే అవకాశాలుండటంతో..అక్కడ నుంచి సీటు వస్తే పోటీ  చేస్తానని..లేదంటే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే ఈ అంశంపై   చంద్రబాబు.. టీడీపీకి ఆయన పార్టీ ఆరంభం నుంచి ఉన్నారని పవన్ కళ్యాణ్‌తో చర్చించి  పవన్ ను ఒప్పించారు.

దీంతో  నిడదవోలు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌ను పోటీ చేయమంటూ పవన్ కళ్యాణ్ ఆదేశించారని  దుర్గేష్ తెలిపారు.  తాను హైకమాండ్ ఆదేశాలను పాటిస్తానని.. జనసేన పార్టీ విజయానికి కృషి చేస్తానని దుర్గేష్ తెలిపారు. దీంతో  నిడదవోలు నుంచి  కందుల దుర్గేష్ పోటీలో ఉండేలా చేయడానికి.. టీడీపీ హైకమాండ్‌ పవన్ కళ్యాణ్ ను ఒప్పించడంలో విజయం సాధించింది.

అయితే దీనిపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.  ఇదేం  పొత్తు.. ఇదేమి న్యాయం అంటూ కందుల దుర్గేష్ కు ఎలా అయినా రాజమండ్రి రూరల్ సీటు ఇచ్చి తీరాలంటూ దుర్గేష్ మద్దతుదారులు పాదయాత్రను నిర్వహించారు.  ఇప్పటికయినా ఆ సీటును కందుల దుర్గేష్‌కు కేటాయించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని రాజమండ్రి రూరల్ జనసైనికులు హెచ్చరించారు. దీనిపై కందుల దుర్గేష్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తామంతా  ఆయన వెనుకే ఉంటామని చెబుతున్నారు.ఏది ఏమయినా పొత్తు సంగతేమో కానీ.. పొత్తుల వల్ల సొంతపార్టీ నేతలే అధిష్టానానికి ఎదురు తిరుగుతున్న సీన్లు  కనిపిస్తున్నాయంటూ జనసైనికలు ఆవేదన చెందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =