ఏపీలో ఎన్నికలవేళ హాట్ టాపిక్‌గా మారారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అప్పటికే భగ్గుమంటున్న ఎన్నికల హడావుడిని మరింత రాజేశారు. వైసీపీ అధినేత, తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా షర్మిల కంకణం కట్టుకున్నారు. జగన్‌పై సూటి పోటి వ్యాఖ్యలతో.. మాటల తూటాలు పేలుస్తూ సంచలనంగా మారారు. ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేశారు.
ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేజిక్కించుకున్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు.. పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి జంప్ అయిన వారిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు షర్మిల ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమిని టార్గెట్‌గా పెట్టుకొని స్పీడ్ పెంచారు. కడప నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డికి పోటీగా షర్మిల బరిలోకి దిగారు. తన బాబాయిని తహ్య చేసిన హంతకుడు అవినాశ్ రెడ్డి అంటూ కడపలో జోరుగా షర్మిల ప్రచారం నిర్వహించారు. వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత కూడా షర్మిలకు మద్ధతుగా నిలిచారు. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో షర్మిల బస్సుయాత్ర కూడా నిర్వహించారు.
అయితే షర్మిల ఎంతో కష్టపడినప్పటికీ.. కడపలో ఎటువంటి ప్రభావం చూపలేదనే మాట వినిపిస్తోంది. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెబుతున్నాయి. ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఆయా స్థానాల్లో కూటమి, వైసీపీ అభ్యర్థులే గెలిచే అవకాశం ఉందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. టీడీపీ,బీజేపీ, జనసేన కూటమికే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. కాంగ్రెస్ ఏపీలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే అవకాశం ఉందని ఏ ఒక్క సర్వే కూడా చెప్పడం లేదు. దీంతో ఈసారి కడపలో షర్మిల గెలవడం కష్టమేనా?.. మరొసారి అవినాశ్ రెడ్డి కడపలో జెండా ఎగరవేస్తారా? అనే చర్చ జరుగుతోంది. కడపలో ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? లేదా అవన్నీ తప్పు అని రుజువు చేస్తూ వైఎస్ షర్మిల గెలుపొందుతారా? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY