జీవిత ఖైదు పడ్డ మహిళా ఖైదీల విడుదలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh, AP Govt Decided To Release Women Prisoners, AP Govt Decides to Release Women Prisoners, ap women prisoners release, ap women prisoners release news, ap women prisoners release updates, Release Of Women Prisoners, women prisoners release in ap, YS Jagan

రాష్ట్రంలో మహిళా ఖైదీల విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత ఖైదు పడి ఐదు సంవత్సరాల జైలుశిక్ష పూర్తిచేసుకున్న మహిళా ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ విడుదల చేశారు. జీవిత ఖైదు పడిన మహిళా ఖైదీల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఇక మహిళా ఖైదీల విడుదలకు మార్గదర్శకాలు రూపొందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని నియమించారు. సభ్యులుగా ప్రభుత్వ న్యాయ కార్యదర్శి, డీజీపీ లేదా డీజీపీ నామినేట్‌ చేసిన పోలీస్‌ అధికారి, సీఐడీ ప్రధాన సలహాదారు, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ, జిల్లా జడ్జి, జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఉండనున్నారు. మహిళా ఖైదీల సమాచారాన్ని సమీక్షించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉండే వారి జాబితాను ఈ కమిటీ ప్రభుత్వానికి అందజేయనుంది. అనంతరం ఎంపిక చేసిన మహిళా జీవిత ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − three =