టీడీపీకి మేయర్ పదవి?

Will Telugu Desam Party Get Visakha Mayor Post,Telugu Desam Party Get Visakha Mayor Post,Visakha Mayor Post,Telugu Desam Party,TDP, AP, pawan kalyan, Chandrababu Naidu,New Ministers,TDP,Andhra Pradesh,AP CM,Janasena,Atchannaidu,Satyaprasad,AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu
tdp, telugu desam party, visaka mayor post, ap

తెలుగు దేశం పార్టీకి విశాఖ మేయర్ పదవి అందని ద్రాక్షలానే ఉండిపోయింది. నలభై ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హయాంలో విశాఖ మేయర్ పదవి టీడీపీకి దక్కింది. ఆ తర్వాత నుంచి ఆ పదవి టీడీపీని వరించలేదు. అయితే నలభై ఏళ్ల తర్వా విశాఖ మేయర్ పదవి తెలుగు దేశం పార్టీకి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు టీడీపీ నాలుగు దశాబ్దాల కోరిక నెరవేరే అవకాశం వచ్చింది. గతంలో మేయర్ పదవి టీడీపీ గుమ్మంలోకి వచ్చి వెళ్లినప్పటికీ.. ఈసారి మాత్రం కచ్చితంగా దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు.

విశాఖ కార్పోరేషన్‌ అయ్యాక జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడ బీజేపీ గెలుపొందింది. మేయర్ పదవిని దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దివంగత నేత ఎన్టీఆర్ అక్కడ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి విశాఖ మేయర్ పదవిని 1987లో తెలుగు దేశం పార్టీ దక్కించుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. వరుసగా 1995, 2000, 2007లలో విశాఖలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. వరుసగా మూడుసార్లు విశాఖ మేయర్ పదవిని దక్కించుకుంది. 2012లో ఎన్నికలు జరగలేదు.  2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత విశాఖలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.

హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖ అతలాకుతలం అయిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలబడ్డారు. విశాఖలో సహాయ చర్యలు చేపట్టి అక్కడి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు. ఎన్నో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఆ సమయంలో విశాఖలో లోకల్ బాడీ ఎన్నికలు పెడితే గెలుస్తామని చంద్రబాబుకు పలువురు సూచించారు. కానీ అప్పట్లో చంద్రబాబు దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపొంది ఏపీలో అధికారంలోకి వచ్చింది. 2021లో విశాఖలో వైసీపీ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. ఆ తర్వాత నాలుగేళ్లకు కానీ లోకల్ బాడీస్‌లో అవిశ్వాసం పెట్టొద్దని వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసింది.

అయితే వైసీపీ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం సవరించాలని చూస్తోంది. మూడేళ్లు దాన్ని కుదించాలని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉంది. అదే సమయంలో దీన్ని కుదించడం ద్వారా విశాఖ కార్పోరేషన్‌తో పాటు.. చాలా కార్పోరేషన్లు తెలుగు దేశం పార్టీ పరం కానున్నాయి. విశాఖ కార్పోరేషన్లలో వైసీపీకి ప్రస్తుతం బలం ఉంది. కానీ అందులోని కీలక నేతలు తెలుగు దేశం పార్టీ వైపు చూస్తున్నారు. వారిని మచ్చిక చేసుకుంటే టీడీపీకి విశాఖ కార్పోరేషన్ దక్కడం ఖాయం. ప్రస్తుతం టీడీపీ వారిని దగ్గరకు చేసుకునే పనిలో ఉంది. విశాఖలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే టీడీపీకి విశాఖ మేయర్ పదవి దక్కడం ఖాయమని విశ్లేకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE